నవచేతన కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "నవచేతన" కార్యక్రమంలో భాగంగా, 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లల అభివృద్ధి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు రూపొందించిన (AI) ఆధారిత స్క్రీనింగ్ వ్యవస్థపై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే లోపాలను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పలువురు సిడిపివోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్