ఇందుకూరుపేట మండలం బీజేవైఎం కమిటీ 22 మంది సభ్యులతో మంగళవారం నాడు ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీకి బర్రె నవీన్ కుమార్ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తనకు ఈ పదవిని అప్పగించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని నవీన్ కుమార్ తెలియజేశారు.