కోవూరు నియోజకవర్గం పరిశీలకులుగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నేత బోనుబోయిన ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీనిపై ప్రసాద్ స్పందిస్తూ. ఈ పదవి రావడం మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అన్నారు.