జొన్నవాడ: ఆషాడ మాస సారే సమర్పణ

ఆషాఢ మాసం సందర్భంగా జొన్నవాడ లోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. కోవూరు వాసవి ఆర్య వైశ్య భక్త బృందం త్రివేణి, మాధవి ఆధ్వర్యంలో సుమారు 30 మంది మహిళలు ఆషాఢం సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి భక్త బృందాన్ని స్వాగతించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు.

సంబంధిత పోస్ట్