కొడవలూరు మండలం రామన్నపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొడవలూరు గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతతో బైక్ రోడ్డుపై పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు ఇంకా తెలియరాలేదు.