టపాసుల నిప్పురవ్వలతో కోవూరులో అగ్నిప్రమాదం

కోవూరు సాలుచింతల సమీపంలో ఆదివారం రాత్రి టపాసుల నిప్పురవ్వల కారణంగా ఒక లేఅవుట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చెట్లు, చెత్తాచెదారం కాలిపోయాయి. సమీప ఇళ్లకు మంటలు వ్యాపిస్తాయేమోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్