కోవూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

మంగళవారం పడుగుపాడు రైల్వే స్టేషన్ పరిధిలోని ఇనమడుగు గేటు వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో సుమారు 40 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నెల్లూరు రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి చేతికి సెలైన్ కట్టిన కెనాల్స్ ఉండటంతో, అతను ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్