పేదల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందించే సామర్ధ్యం కూటమి ప్రభుత్వానికి మాత్రమే వుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్ళదిబ్బ - గాంధి గిరిజన సంఘంలో ఆమె ఇంటిటికెళ్ళి పెన్షన్ల పంపిణి చేపట్టారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ సుబ్బయ్య పాల్గొన్నారు.