కోవూరు: టీడీపీలో చేరిన పలువురు వైసీపీ ప్రతినిధులు

నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో గురువారం పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరారు. విడవలూరు జడ్పిటిసి తుమ్మల లక్ష్మయ్య వైసీపీకి రాజీనామా చేసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే గాదెలదిన్నె సర్పంచ్ తుమ్మల వెంకటేశ్వర్లు, వరిణి ఎంపిటిసి ఎంబేటి భక్త వత్సలం, వరిణి సర్పంచ్ రావెల మల్లికార్జున్ వందలాది మంది కార్యకర్తలతో టిడిపిలో చేరారు.

సంబంధిత పోస్ట్