నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్‌లోని తమ నివాసంలో, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కావలి, కందుకూరు, కోవూరు నియోజకవర్గాలకు చెందిన 10 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. నడవలేక, ఇతరులపై ఆధారపడలేక బతుకు భారమైపోతున్న తరుణంలో తమ మొర ఆలకించి బ్యాటరీ ట్రై సైకిళ్లను అందజేసిన విపిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులైన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియచేశారు.