కోవూరు: పెన్నా నది లో యువకుడు గల్లంతు

కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెం సమీపంలో పల్లెపాలెం వద్ద పెన్నానదిలో శుక్రవారం మధ్యాహ్నం సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు అయ్యాడు. పోతిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఏడుమంది యువకులు సరదాగా ఈత కొట్టేందుకు పెన్నానదికి వెళ్లారు. నదిలో మునిగి ఈత కొడుతుండగా మేకల సురేష్ (25) అనే యువకుడు నీళ్లలో కొట్టుకొని పోయి గల్లంతు అయ్యాడు. గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టినా యువకుడు దొరకలేదు.

సంబంధిత పోస్ట్