విజయవంతంగా ముగిసిన జనసేన పార్టీ సభ్యుత్వాలు

కోవూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి 10నుండి మార్చి 5 వరకు మూడవ విడత జనసేన పార్టీ క్రియా శీలక సభ్యుత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పై విడవలూరు మండల ప్రధాన కార్యదర్శి శ్రీను మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కోవూరు నియోజకవర్గం నుండి మూడవ విడత జనసేన పార్టీ క్రియా శీలక సభ్యుత్వం నమోదు చాలా విజయవంతంగా జరిగింది అని తెలిపారు. మూడవ విడతగా జరిగిన జనసేన పార్టీ సభ్యుత్వాలలో కొత్త వాళ్ళు ఎక్కువుగా సభ్యుత్వం నమోదు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు జనసేన వైపు నిలబడతారు అని, పవన్ కళ్యాణ్ సీఎంగా చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్