కోవూరు నియోజకవర్గ తెలుగు యువత, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో గంజాయికి వ్యతిరేకంగా తమ గళం విప్పింది. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో కోవూరు తెలుగు యువత నాయకులు “గంజాయి వద్దు బ్రో” పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ స్ఫూర్తితో గంజాయి రహిత కోవూరు సాధన కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు.