రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జలధార” కార్యక్రమం కింద నెల్లూరు జిల్లాలో చెరువులు, కాలువలు, చెక్‌డ్యాంల మరమ్మతులు, భూగర్భజలాలు పెంచేందుకు అవసరమైన మట్టి పనుల పునరుద్ధరణ వేగవంతంగా కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి, భూగర్భ జలాల స్థాయిని మెరుగుపరిచి, ప్రతి నీటిబొట్టును భద్రపరచుకోవడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర చర్యలు చేపడుతున్నారు.