పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించండి

బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని అన్ని పంచాయతీలలో బకాయిలు ఉన్న ఇంటి, ఇతర పన్నులను సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని ఎంపీడీవో ఎస్ రంతుల్లయ్య కోరారు. మంగళవారం ఇసుక పాలెం, మునులపూడి పంచాయతీలలో పర్యటించి, బకాయిల చెల్లింపులో జాప్యం జరిగితే పంచాయతీ అభివృద్ధి ఎలా కుంటుపడుతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జీవీ రాధాకృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శులు శ్రీలత, మేరీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్