ఏపీ విద్యుత్ ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లుగా తమ సమస్యలు పరిష్కారం కాలేదని, ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రూ. 48 వేల వేతనం ఇవ్వాలని, లేకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.