బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై కేఎం హాస్పిటల్స్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు నుంచి వస్తున్న ఒక ఇన్నోవా కారు, పట్టణం వైపు నుంచి వస్తున్న మరో ఇన్నోవా కారును ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.