100% ఉత్తీర్ణత లక్ష్యంగా చదవాలి: డీడీ శోభారాణి

నెల్లూరు జిల్లాలోని మనుబోలులో గల ఎస్సీ బాలుర, బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహాలను మంగళవారం సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, హాస్టల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆమె సూచించారు. విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించి, మరింత శ్రద్ధతో పరీక్షలకు సిద్ధమై మంచి మార్కులు సాధించాలని ఆమె ప్రోత్సహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్