కోవూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం కావడంతో అందుకు ధన్యవాదాలు చెప్పేందుకు కోవూరు వైసీపీ కార్యాలయంలో నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీకి మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసిపి కార్యాలయం వద్దకు వచ్చి నినాదాలు చేయడంతో వైసిపి మహిళా నేతలు వాగ్వాదానికి దిగారు.