నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పంట చేతికొచ్చే సరికే వర్షాలు పడటం వల్లన రైతులు నష్టపోయారు, ఎకరం, అర ఎకరం కలిగిన రైతులు ఓరి దేవుడా అంటూ విలపిస్తున్నారు. కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం వరిని దండిగుంట గ్రామంలో వర్షాలు పడటం వల్లన భాదపడుతున్న రైతులను కోవూరు జనసేన పార్టీ నాయకులు దాడి అజయ్ కుమార్ కలిసారు. ఆయన మాట్లాడుతూ రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సూచించారు. దేశానికే రైతు వెన్నుముక అంటూ హితబోధ చేసారు. ఈ కార్యక్రమంలో కొమ్ము బాలాజి, ఆవుల శివకుమార్, మిగతా జనసైనికులు అందరూ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్