నెల్లూరు జిల్లా మనుబోలులో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించిన విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానిక పడమటి వీధిలో రామాలయంలో తలుపులు పగలగొట్టి దొంగతనానికి యత్నిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రావడంతో దొంగలు వారి బైక్ అక్కడే వదిలేసి మల్లికార్జున్ అనే వ్యక్తి బైక్ పై పరారయ్యారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.