టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పార్టీ అత్యున్నత విధాన నిర్ణయాత్మక మండలి అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్