విడవలూరు: శ్రీనివాసులు రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

మాతూరు శ్రీనివాసులు రెడ్డి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం శ్రీనివాసులు రెడ్డి మరణ వార్త తెలియగానే ఆమె విడవలూరులోని ఆయన నివాసానికి చేరుకొని భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రైతు సమస్యలపై చిత్తశుద్ధితో ప్రజలకు సేవలందించిన శ్రీనివాసులు రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె భగవంతుడిని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్