దేశవ్యాప్తంగా కార్మికులు బుధవారం సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలో కార్మికులు CITU ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్మికవర్గానికి నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస గౌరవ వేతనం రూ. 26,000 పెంచాలన్నారు. కార్మికులపై పని భారం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల కార్యదర్శి మల్లికార్జున పాల్గొన్నారు.