నెల్లూరులో 13 మంది ట్రాన్స్జెండర్స్ అరెస్ట్

నెల్లూరు మినీ బైపాస్ లోని వెంగమాంబ డాబాలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న 13 మంది ట్రాన్స్ జెండర్లను అరెస్ట్ చేసినట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. బాలాజీ నగర్ పరిధిలో ఎక్కడైనా ట్రాన్స్ జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే వెంటనే సమాచారం అందించాలని, వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్