నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, కనుపర్తిపాడు గిరిజన సంఘంలో రూ. 30లక్షల వ్యయంతో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 24వ డివిజన్ అభివృద్ధికి రూ. 5.60 కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి, తదితరులు పాల్గొన్నారు.