నెల్లూరులో దారుణ ఘటన

నెల్లూరు నక్కలోళ్ళ సెంటర్ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్,  కండక్టర్ లపై ఐదు మంది దుండగులు ఆదివారం సాయంత్రం బ్లేడుతో మెడ మొహంపై దాడి చేశారు.  అంతకుముందు బైకు అడ్డంగా ఉందని బస్సు డ్రైవర్ చెప్పడంతో వాగ్వాదం జరిగింది. గాయపడిన వారిని బాధితులను హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు గాంధీనగర్ కి చెందిన మన్సూర్,  గంగపట్నం చెందిన కండక్టర్ సలీమ్ గా గుర్తించారు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్