నెల్లూరు కిమ్స్ హాస్పిటల్‌లో జరిగిన ఒక మానవత్వపు మహోన్నత ఘట్టంలో, జీవితాంతం సమాజ సేవ చేసిన వేంకటాద్రి కుమారుడు ఉలవపాటి జీవ, మరణానంతరం కూడా తన అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మను, ఇద్దరికి చూపును ప్రసాదించి 'మహాదాత'గా నిలిచారు. గత జూన్ 10న బైక్‌పై వెళ్తుండగా కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన జీవ, తన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కళ్ళను అవయవ దానం చేశారు. ఈ సంఘటన పలువురి కళ్ళను చెమరింపజేసింది.