నెల్లూరు రూరల్ జొన్నవాడ బ్రిడ్జి ఆర్చి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కొండలపూడి గ్రామానికి చెందిన సునీల్(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.