వరికుంటపాడు మండలం కనియంపాడు అటవీ ప్రాంతంలో గడ్డి ఊడలు సేకరించడానికి వెళ్లి దారి తప్పిన మామిడి నాగమ్మ (65) అనే వృద్ధురాలిని పోలీసులు బుధవారం అర్ధరాత్రి సురక్షితంగా గుర్తించారు. చీకటి పడుతున్నా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. నాగమ్మకు ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వృద్ధురాలిని కాపాడిన పోలీసులకు గ్రామస్తులు, కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.