ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులో అవగాహన వాక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ జెండా ఊపి ప్రారంభించారు. దర్గామిట్ట కిమ్స్ ఆసుపత్రి నుంచి ఏసీ సుబ్బారెడ్డి క్రీడామైదానం వరకు జరిగిన ఈ ర్యాలీలో కమిషనర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజం కోసం పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. పొగాకు ఉత్పత్తులపై అవగాహన కల్పించే కిమ్స్ ఆసుపత్రి కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.