నెల్లూరు నగరంలోని 33/11 కె. వి. ఎం. జి. నగర్ సబ్ స్టేషన్ లోని 11 ఎంఎస్ఆర్ ఫీడర్లో చెట్లకొమ్మల తొలగింపు, మరమ్మత్తుల కారణంగా బ్రహ్మానంద పురం, డిఈఓ ఆఫీస్, బెజవాడ ఓబుళరెడ్డి నగర్, రాజ గోపాల పురం, బొల్లినేని హాస్పిటల్, జి. టి. రోడ్డు పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 8: 00 గంటల నుండి మధ్యాహ్నం 1: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.