చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి నారాయణ

జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నెల 30న నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, అలాగే వచ్చే నెల 1వ తేదీన ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో పెన్షన్ల పంపిణీకి వస్తారని ఆయన వివరించారు. ఈ రెండు పర్యటనలు విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్