మావిగన్ వ్యతిరేకత మళ్లించేందుకే.. దాడులు చేస్తున్నారు

మావిగన్‌పై వచ్చిన వ్యతిరేకతను దారి మళ్లించేందుకు వైసీపీ నేతలు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడి చేశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించడానికి ప్రజాస్వామ్యంలో ఎన్నో మార్గాలు ఉన్నాయని, దాడులు చేయడం పూర్తిగా తప్పని ఆయన పేర్కొన్నారు. దాడులే సమాధానం అయితే, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై రోజూ సాక్షిలో వచ్చే వ్యతిరేక వార్తలకు కూడా ఇదే మార్గం అనుకోవాలా అని ప్రశ్నించారు. అలా అయితే రోజూ దాడులు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్