ఆవాజ్ ఏర్పడిన 23 ఏళ్ల కాలంలో మతసామరస్యానికి, లౌకికత్వానికి ప్రతిక అయిన నెల్లూరు జిల్లాలో మొదటిసారి రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ తెలిపారు. బుధవారం ఆవాజ్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్ర మహాసభకు సంబంధించిన విషయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం భారత రాజ్యాంగం - లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సదస్సు జరుగుతుందని తెలిపారు.