మహిళా భద్రత, సైబర్ నేరాలపై కాలేజీలో అవగాహన

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, ఎమరాల్డ్స్ కాలేజీలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ థమీమ్ అహ్మద్ విద్యార్థులకు టీనేజ్ సమస్యలు, పోక్సో చట్టం, సోషల్ మీడియాలో సైబర్ ముప్పులు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మోసాలు, ఏఐ దుర్వినియోగం, లోన్ యాప్ వేధింపులపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో శక్తి యాప్, 181, 1930, 112 నెంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్