ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని బీదాకు ఆహ్వానం

మే 10వ తేదీన నెల్లూరులో జరగనున్న అఖిల భారత యాదవ మహా సంఘం ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరు కావాలని సంఘం నేతలు ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్రకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెయ్యల పవన్ కుమార్ యాదవ్ ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పెరుమాళ్ళ పద్మజాయాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి విఠపు లలితారామ్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉడతా శైలజ యాదవ్, దినేష్ యాదవ్, నందిని నిరంజన్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్