నెల్లూరు నగరానికి చెందిన రెనిల్‌కుమార్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్ రంగంలో ఒక కొత్త సంచలనాన్ని సృష్టించారు. ఆదివారం నెల్లూరు నుండి ఆయన 'బ్లేజ్‌అప్' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఈ ప్లాట్‌ఫామ్ అన్ని ఎంటర్‌ప్రైజ్ ఆపరేషన్స్‌కు ఉపయోగపడుతుంది. ద్వితీయ స్థాయి నగరం నుండి అంతర్జాతీయ స్థాయి యాప్‌ను ఆవిష్కరించడం ఇదే ప్రథమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 200 నుండి 500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు రెనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మొత్తం 120 దేశాలలో 'బ్లేజ్‌అప్'ను విస్తరించాలనేది ఆయన లక్ష్యం.