నెల్లూరులో గంజాయి ముఠా అరెస్ట్

నెల్లూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను వేదాయపాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రశాంత్ నగర్ వద్ద గంజాయి విక్రయానికి సిద్ధమైన అరవ సందీప్, సయ్యద్ లియాఖత్ అలీ, ఉప్పాల జాన్ వెస్లీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 66,600 విలువైన 6.660 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఏఎస్పీ దీక్ష తెలిపారు. ఈ వివరాలను నెల్లూరు టౌన్ ఎస్డిపిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్