నెల్లూరు: అయ్యప్ప గుడి వద్ద కారు బీభత్సం

నెల్లూరు అయ్యప్ప గుడి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీ కొని కొన్ని మీటర్లు లాక్కొని వెళ్ళింది. కారును ఓ మహిళ డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, గాయపడిన వ్యక్తిని స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదానికి పాల్పడిన మహిళ మాత్రం మరో కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

సంబంధిత పోస్ట్