మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు నమోదు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. బుధవారం నెల్లూరులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సిబ్బందిని బెదిరించారని బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాణిపై 189(2), 126(2), 79, 351(2) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్