చేజర్ల మండలం ఆదూరుపల్లిలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాముడు, లక్ష్మణుడి విగ్రహాలను ట్రాక్టర్‌పై ఊరేగించారు. ఈ ఊరేగింపులో ఓ ముస్లిం వ్యక్తి ట్రాక్టర్ వద్దకు వచ్చి స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సంఘటన మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.