పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సీపీఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడుతూ, పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమని విమర్శించారు. విశ్వగురు అని చెప్పుకునే ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని వారు ఆరోపించారు.