పన్ను పై 5 శాతం రిబేటు పై అవగాహన కల్పించండి - కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, రెవెన్యూ అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులతో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయి రెవెన్యూ వసూళ్లపై సమీక్షించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్నులపై 50% వడ్డీ రాయితీ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను చెల్లింపుపై 5% రిబేటు పథకం కేవలం మూడు రోజులు (ఈనెల 30వ తేదీ వరకు) మాత్రమే అందుబాటులో ఉందని, ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్