కోవూరు సాలుచింతల సబ్ స్టేషన్ ఆవరణ ఎదుట రోడ్డు మార్జిన్ లో ఇళ్ల తొలగింపుపై వైసీపీ నాయకులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని విమర్శించడం సరికాదని పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల రెడ్డి, టీడీపీ నాయకుడు ఇంతా మల్లారెడ్డి అన్నారు. కోవూరులో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రోడ్డు మార్జిన్ లో నివాసాలు ఉంటున్న వారికి ప్రభుత్వం ఇళ్లస్థలాల్ని కేటాయించగా, వారు ఇళ్లు కట్టుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో తాటిపర్తి విజయకుమార్ రెడ్డి, గాదిరాజు అశోకుమార్, హరికృష్ణ కూడా పాల్గొన్నారు.