మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని 8వ డివిజన్ ఆర్ఎస్ఆర్ స్కూల్ నుండి హిమాలయ స్కూల్ వరకు జరుగుతున్న కాలువ ఆధునీకరణ పనులను నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పేదలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయడమే లక్ష్యమని, పనులు పూర్తయ్యాక గతంలో నివసించిన వారందరికీ తిరిగి స్థలాలు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు.