ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కోవూరు నియోజకవర్గంలోని అనారోగ్య బాధితులకు 7 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించిన సీఎం చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బుచ్చిరెడ్డి పాళెం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గ్రామాలలో నాయకులు ఐకమత్యంగా ఉండాలని, ఐకమత్యం ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం అభిమానించేలా ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల అభిమానం చూరగొనాలని సూచించారు.