దుత్తలూరు మండలంలో రూ.2.11 కోట్ల విలువైన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలను అధికారులు పంపించారు. ఈ మేరకు ఎంపీడీవో హనుమంతరావు వివరించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహిచారు. ఈ సమావేశంలో పంచాయతీల వారీగా రోడ్ల వివరాలను చర్చించారు. ఉపాధి హామీ నిధులతో ఈ రోడ్లను నిర్మించనున్నట్టు తెలిపారు.