నెల్లూరులో జగన్ కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం నెల్లూరులో పర్యటించారు. పోలీసులు పటిష్ట ఆంక్షలు మధ్య జగన్ పర్యటన కొనసాగింది. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ ఇసుకేస్తే రానంత మంది జగన్ అభిమానులు తరలివచ్చారు. అడుగడుగునా అభిమానులు జగన్ కు నీరాజనం పలికారు. జగన్ పర్యటన వల్ల నెల్లూరు నగరంలో విపరీతంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలు జగన్ అభిమానులు, ఆయన నినాదాలతో నిండిపోయాయి.

సంబంధిత పోస్ట్