నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ ప్రసూతి విభాగంలో అగ్నిప్రమాదం

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ప్రసూతి, చిన్నారుల వార్డులలో మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వార్డులన్నీ చీకటిమయం కావడంతో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆసుపత్రి అధికారులు, సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్